ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ చైర్మన్, లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా, ఆయన కుటుంబం తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ సీజన్ పునఃప్రారంభానికి ఒక రోజు ముందు సంజీవ్ గోయెంకా, ఆయన కుటుంబం ఆలయాన్ని సందర్శించారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ ఒక వారం పాటు నిలిపివేయబడింది.
సంజీవ్ గోయెంకా ఏకంగా కొన్ని కోట్ల విలువైన ఆభరణాలను శ్రీవారి కోసం టీటీడీకి అందించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరికి గోయాంక ఈ విరాళాన్ని అందజేశారు. శ్రీవారి కోసం గోయెంకా శంఖు, చక్రాలు, వరద, కటి హస్తాల ఆభరణాలను సమర్పించారు. టీటీడీ అధికారులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని గోయెంకా తెలిపారు.