తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం(ఫిబ్రవరి 8న) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 11 నుండి 20 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 11.30 నుంచి 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు..
2023 ఫిబ్రవరి 11 - ధ్వజారోహణం(మీనలగ్నం) – హంస వాహనం
2023 ఫిబ్రవరి 12 – సూర్యప్రభ వాహనం – చంద్రప్రభ వాహనం
2023 ఫిబ్రవరి 13- భూత వాహనం – సింహ వాహనం
2023 ఫిబ్రవరి 14 - మకర వాహనం – శేష వాహనం
2023 ఫిబ్రవరి 15 - తిరుచ్చి ఉత్సవం – అధికారనంది వాహనం
2023 ఫిబ్రవరి 16 - వ్యాఘ్ర వాహనం – గజ వాహనం
2023 ఫిబ్రవరి 17 - కల్పవృక్ష వాహనం – అశ్వ వాహనం
2023 ఫిబ్రవరి 18 - రథోత్సవం (భోగితేరు) – నందివాహనం
2023 ఫిబ్రవరి 19 - పురుషామృగవాహనం – కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం.
2023 ఫిబ్రవరి 20 - శ్రీ నటరాజ స్వామివారి సూర్యప్రభ వాహనం – త్రిశూలస్నానం – ధ్వజావరోహణం, రావణాసుర వాహనం.