తిరుమలలో భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం

క్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం భక్తులకు దర్శనానికి

By అంజి  Published on  22 May 2023 3:33 AM GMT
TTD, VIP darshans, Tirumala, devotees

తిరుమలలో భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం 

సమ్మర్‌ హాలీడేస్‌ కారణంగా చాలా మంది భక్తులు తమ పిల్లజల్లలతో తిరుమల కొండకు చేరుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తిరుమలకు భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలోనే జూన్‌ 30వ తేదీ వరకు శ్రీవారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేయడంతో 20 నిమిషాలు ఆదా అవుతోంది. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించనున్నారు. దీని ద్వారా 30 నిమిషాల సమయం ఆదా కానున్నది.

స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు. దీంతో 3 గంటలు ఆదా అవుతుంది. ఇదిలా ఉంటే.. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నది. టీటీడీ వెబ్‌సైట్‌ https//tiru patibalaji. ap.gov.in లో దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఆదివారం స్వామివారిని 84,539 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 39,812 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Next Story