నింగిలోకి దూసుకువెళ్లనున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2.. సర్వం సిద్దం
ISRO to launch new rocket SSLV-D2 today.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్దమైంది.
By తోట వంశీ కుమార్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్దమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్‌వీ-డీ2ను ప్రయోగించనుంది. ఈ రోజు(శుక్రవారం) ఉదయం 9.18 గంటలకు మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 నింగిలోకి దూసుకువెళ్లనుంది. ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకు చెందిన 156.3కిలోల బరువు కలిగిన ఈవోఎస్-07 ఉపగ్రహంతో పాటు 11.5 కిలోల బరువున్న యూఎస్ఏ అంటారిస్ సంస్థకు చెందిన జానుస్-1 అలాగే చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2 ను కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.
SSLV-D2/EOS-07 Mission: Countdown begins tomorrow at 0248 hrs ISThttps://t.co/D8lncJrx8K
— ISRO (@isro) February 9, 2023
Watch the launch LIVE from 0845 hrs IST at https://t.co/DaHF8JKLUg https://t.co/V0ccOnT4d5https://t.co/zugXQAYy1y
from 0855 hrs IST at https://t.co/7FmnWEm1YF @DDNational pic.twitter.com/tfNWGyJNM4
ఇస్రో చైర్మన్ సోమనాథన్ పర్యవేక్షణలో ఎంఆర్ఆర్ కమిటీ ఛైర్మన్ ఈఎస్ పద్మకుమార్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం గురువారం ఉదయం జరిగింది. గతేడాదిలో ఎస్ఎస్ఎల్‌వీ-డీ1 పేరుతో చేపట్టిన తొలి ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ఇస్త్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.
ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 రాకెట్ మొత్తం పొడవు 34 మీటర్లు కాగా వెడల్పు రెండు మీటర్లు, బరువు 119 టన్నులు. ఈ ప్రయోగం 15 నిమిషాల్లో పూర్తి కానుంది. 450 కిలో మీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్-07 అదేవిధంగా, 880 సెకన్ల వ్యవధిలో జానుస్-1ను, 900 సెకన్లకు ఆజాదీశాట్ ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టడంతో ప్రయోగం పూర్తి కానుంది.