తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. టీటీడీ ఆలయాలతో పాటు ఉప ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తోంది.

By అంజి  Published on  2 July 2023 5:49 AM GMT
Ttd Devotees, Upi Payments, Temples, Tirumala

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌న్యూస్‌ చెప్పింది. టీటీడీ ఆలయాలతో పాటు ఉప ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. సేవా టికెట్లు, అగరబత్తులు, డైరీలు, ప్రసాదాలు, పంచగవ్య ఉత్పత్తులు, క్యాలెండర్లు కొనుగోలు చేసే భక్తుల సౌకర్యార్థం ఫోన్‌ పే, క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ద్వారా యూపీఐ, డెబిట్‌ కార్డు ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు శనివారం నాడు ఆయా ఆలయాల అధికారులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించిన జేఈవో వీరబ్రహ్మం ఆదేశాలిచ్చారు. జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న డెవలప్‌మెంట్‌ వర్క్స్‌ని తొందరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

టీటీడీ వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, యాత్రికులు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్‌, బస్టాండు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల గురించి తెలిసేలా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక ఆలయాల్లో కల్యాణోత్సవంతోపాటు ఇతర ఆర్జితసేవలు ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలించి పూర్తి నివేదిక అందించాలన్నారు. ఆలయాల్లో పచ్చదనం-పరిశుభ్రతలో భాగంగా భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు పెంచాలని డీఎఫ్‌వోను ఆదేశించారు. అన్ని ఆలయాల్లో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు. కాగా ఆలయాల్లో యూపీఏ చెల్లింపుల ఏర్పాటుపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story