గంగమ్మ జాతర: అల్లు అర్జున్ 'మాతంగి' గెటప్‌లో ఎంపీ గురుమూర్తి

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు మాతంగి వేషాలతో పొంగళ్లు

By అంజి  Published on  15 May 2023 2:00 PM IST
Gangamma jatara, Tirupati, MP Gurumurthy, Allu Arjun, Matangi look

గంగమ్మ జాతర: అల్లు అర్జున్ మాతంగి గెటప్‌లో ఎంపీ గురుమూర్తి

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు మాతంగి వేషాలతో పొంగళ్లు సమర్పించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాజాగా తిరుపతి ఎంపీ గురుమూర్తి.. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న "పుష్ప 2" చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర నుండి అద్భుతమైన మాతంగి దుస్తులలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. భక్తి చైతన్య యాత్రలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారీ ఊరేగింపులో గురుమూర్తి హాజరు కావడం కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చింది. మాతంగి వేషధారణలో ఎంపీ గురుమూర్తితో కలసి చిరస్మరణీయమైన ఘట్టాలను తిలకించేందుకు తిరుపతి భక్తులు, స్థానికులు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. లయబద్ధమైన డప్పుల దరువులు, మంగళ వాయిద్యాల ధ్వనులతో ఎంపీ గురుమూర్తి అనంతవీధి నుంచి గంగమ్మ దేవాలయం వరకు నడిచి గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. మాతంగి వేషంలో ఉన్న ఎంపీ గురుమూర్తి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Next Story