వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి పుల్ డిమాండ్‌.. 45 నిమిషాల్లో 2.20ల‌క్ష‌ల టికెట్లు ఖాళీ

Devotees booked 2 lakh tickets with in 45 minutes.క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2022 5:53 AM GMT
వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి పుల్ డిమాండ్‌.. 45 నిమిషాల్లో 2.20ల‌క్ష‌ల టికెట్లు ఖాళీ

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు ప‌రిత‌పిస్తుంటారు. నిత్యం వేలాది మంది భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకుంటారు. ఇక ప్ర‌త్యేక రోజుల్లో తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ విప‌రీతంగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా స‌రే వైకుంఠ ఏకాద‌శి రోజున స్వామి వారిని ద‌ర్శించుకోవడానికి భ‌క్తులు పోటెత్తుతారు. భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ వ‌స్తోంది. ఈ సారి కూడా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి భ‌క్తుల ర‌ద్దీ త‌ప్ప‌ద‌ని మ‌రోసారి రుజువైంది. వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని 10 రోజుల‌కు సంబంధించిన 2ల‌క్ష‌ల ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌గా కేవ‌లం 45 నిమిషాల్లో అన్ని టికెట్లు ఖాళీ అయ్యాయి.

ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి 2న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుద‌ల చేసింది. 2ల‌క్ష‌ల 20 వేల టికెట్ల‌ను అందుబాటులోకి తేగా కేవ‌లం 45 నిమిషాల్లో ఖాళీ అయ్యాయి.

మరోవైపు సర్వ దర్శనం భక్తుల‌కు జనవరి 1న‌ ఆఫ్ లైన్ విధానంలో టికెట్లు కేటాయించ‌నుంది టీటీడీ. తిరుప‌తిలోని 9 కేంద్రాల ద్వారా రోజుకి 50 వేల చొప్పున 5 ల‌క్ష‌ల టికెట్లు విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది

.
Next Story