శ్రీవారిని ద‌ర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ

CJI NV Ramana visits Tirumala temple.కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2022 5:39 AM GMT
శ్రీవారిని ద‌ర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్ర‌వారం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబసమేతంగా తిరుమల చేరుకున్న సీజేఐ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వాదం అందించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు తిరుమల ఆలయానికి చేరుకున్న సీజేఐకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

మే నెల‌లో రికార్డు స్థాయిలో ఆదాయం

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండి ఆదాయం స‌మ‌కూరింది. మే నెల‌లో రికార్డు స్థాయిలో రూ.130 కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) ఈవో ధ‌ర్మారెడ్డి తెలిపారు. ఒక నెల‌లో ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావ‌డం టీటీడీ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారన్నారు. మే నెల‌లో 22.62 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకుర‌న్నారు. టైంస్లాట్ స‌ర్వ‌ద‌ర్శ‌న విధానం పునఃప్రారంభించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నట్లు తెలిపారు. టైంస్లాట్ టోకెన్ కేంద్రాలు ఏర్పాటు చేశామ‌ని, త్వ‌ర‌లోనే టైంస్లాట్ టోకెన్ల‌ను భ‌క్తుల‌కు జారీ చేస్తామ‌న్నారు.

Next Story
Share it