తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం మరో వారం రోజుల్లో ముగుస్తుండటంతో సీఎం జగన్.. ఆయన స్థానంలో కరుణాకర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. భూమన కరుణాకర్‌రెడ్డి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు. తాజాగా రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్ హయాంలో రెండో సారి టీటీడీ ఛైర్మన్ పదవిని చేపట్టబోతున్నారు. టీటీడీ చైర్మన్ రేసులో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్లు కూడా వినిపించాయి. చివరకు భూమన కరుణాకర్‌రెడ్డిని పదవి వరించింది.