తిరుపతిలో లాక్‌డౌన్‌ పొడిగింపు

By సుభాష్  Published on  16 Aug 2020 2:54 PM GMT
తిరుపతిలో లాక్‌డౌన్‌ పొడిగింపు

ఏపీలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రంలో ప్రతి రోజు వేలాల్లో పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2లక్షలకుపైగా దాటేసింది.

ఇక ముఖ్యంగా తిరుపతిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్‌ గిరీశ ఆదేశాలు జారీ చేశారు. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షల్లో అధికారులు కొన్ని సడలింపులు ఇచ్చారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు షాపులు తెరుచుకోవచ్చని స్పష్టం చేశారు.

కాగా, చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 22,478 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 225 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,89,829 కేసులు నమోదయ్యాయి. 2650 మంది మృతి చెందారు.

Next Story
Share it