ఏపీలో 3 లక్షల చేరువలో కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే..

By సుభాష్  Published on  16 Aug 2020 1:35 PM GMT
ఏపీలో 3 లక్షల చేరువలో కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే..

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 48,746 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 8,012 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,89,829 కేసులు నమోదయ్యాయి.

ఇక గడిచిన 24 గంటల్లో 10,117 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక కోవిడ్‌తో చిత్తూరు జిల్లాలో 10 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, కర్నూలులో 9 మంది, నెల్లూరులో 9 మంది, అనంతపూర్‌లో 8 మంది, పశ్చిమగోదావరిలో 8 మంది, విశాఖలో 7, గుంటూరులో 6, కడపలో 6, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 4, కృష్ణాలో ముగ్గురు చొప్పున మొత్తం ఒక రోజులోనే 88 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2650 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85,945 కేసులు యాక్టివ్‌లో ఉండగా, 201234 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

జిల్లాల వారిగా కేసుల వివరాలు

అనంతపురం - 580

చిత్తూరు - 981

ఈస్ట్‌ గోదావరి - 875

గుంటూరు - 590

కడప - 286

కృష్ణా -263

కర్నూలు - 834

నెల్లూరు - 423

ప్రకాశం - 614

శ్రీకాకుళం - 773

విశాఖ - 512

విజయనగరం - 388

వెస్ట్‌ గోదావరి - 893



Next Story