తిరుపతి ఎయిర్‌పోర్టుకు త్వరలో కొత్త హంగులు

By Newsmeter.Network  Published on  27 Nov 2019 11:14 AM GMT
తిరుపతి ఎయిర్‌పోర్టుకు త్వరలో కొత్త హంగులు

ఢిల్లీ: తిరుపతి ఎయిర్‌పోర్టులో త్వరలో సరికొత్త వీఐపీ లాంజ్‌ ఏర్పాటు కానుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఎయిర్‌పోర్టు పరిధిలోని 1800 చదరపు మీటర్ల భూ కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అయితే ఇందుకోసం అవసరమైన ఎయిర్‌పోర్టు భూమి కోసం ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు లీజుకు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకు గాను ఏడాదికి కేవలం ఒక్క రూపాయి నామమాత్రపు లీజు ఫీజు చెల్లించాలని కేబినెట్ నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు భూమి ఏపీ కార్పొరేషన్‌కు బదిలీ కాగానే వీఐపీ లాంజ్ నిర్మాణం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

అయితే టెంపుల్ సిటీకి తరచూ వీఐపీలు వస్తూ, పోతూ వుండడంతో ఎయిర్‌పోర్టుకు కొత్త హంగులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ భేటీ నిర్ణయించింది. దానికి అనుగుణంగానే కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story