16 నుంచి 24 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ ఉత్సవం

By సుభాష్  Published on  9 Oct 2020 2:50 AM GMT
16 నుంచి 24 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ ఉత్సవం

ఈనెల 16వ తేదీ నుంచి 24 వరకు తిరుమల తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవలకు తిరుమల కొండలు ముస్తాబవుతున్నాయి. కాగా, గత నెలలో జరిగిన వార్షిక ఉత్సవాలకు ఆలయానికే పరిమితం చేసిన టీటీడీ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మాత్రం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించేందుకు నిర్ణయం తీసుకుంది. స్వామివారి వాహనసేవలను మాడవీధుల్లో జరపాలని సిద్ధమవుతోంది. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ నాలుగు మాడవీధులలో సర్కిల్‌ మార్కింగ్‌ పనులను పూర్తి చేశారు టీటీడీ అధికారులు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈనెల 15న అంకురార్పణను నిర్వహించనున్నారు.

♦ 15న అంకురార్పణ : రాత్రి 7 నుంచి 8 గంటల వరకు

♦ 16న బంగారు తిరుచ్చి ఉత్సవం: ఉదయం 9 నుంచి 11 గంటల వరకు , రాత్రి 7 నుంచి 9 గంటల వరకు.

♦ 17న చిన్నశేష వాహనం: ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, హంస వాహనం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు

♦ 18న సింహవాహనం : ఉదయం 8 నుంచి 10 గంటల వరకు,

ముత్యపు పందిరి వాహనం: రాత్రి 7 నుంచి 9 గంటల వరకు .

♦ 19న కల్పవృక్ష వాహనం: ఉదయం 8 నుంచి 10 గంటల వరకు

సర్వభూపాల వాహనం: రాత్రి 7 నుంచి 9 గంటల వరకు.

♦ 20న మోహినీ అవతారం : ఉదయం 8 నుంచి 10 గంటల వరకు

గరుడసేన: రాత్రి 7 నుంచి 12 గంటల వరకు.

♦ 21న హనుమంత వాహనం: ఉదయం 8 నుంచి 10 గంటల వరకు

పుష్పక విమానం : సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు

గజవాహనం : రాత్రి 7 నుంచి 9 గంటల వరకు

♦ 22న సూర్యప్రభ వాహనం: ఉదయం 8 నుంచి 10 గంటల వరకు

చంద్రప్రభ వాహనం: రాత్రి 7 నుంచి 9 గంటల వరకు.

♦ 23న స్వర్ణ రథోత్సవం : ఉదయం 8 నుంచి,

అశ్వ వాహనం: రాత్రి 7 నుంచి 9 గంటల వరకు.

♦ 24న పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం: ఉదయం 3 నుంచి 5 గంటల వరకు

స్నపనతిరుమంజనం, చక్రస్నానం : ఉదయం 6 నుంచి 9 గంటల వరకు

బంగారు ఉత్సవం: రాత్రి 7 నుంచి 9 గంటల వరకు.

Next Story
Share it