హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మోనోరైల్‌..!

By సుభాష్  Published on  8 Oct 2020 12:09 PM GMT
హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మోనోరైల్‌..!

హైదరాబాద్‌ నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. తాజాగా హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మోనోరైల్‌ లైన్‌ ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ అధికారులతో సంప్రదించి డీపీఆర్‌ సిద్ధం చేయాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. నూతన టూరిజం ప్రాజెక్టులపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత స్థలాల్లో టూరిజం ప్రాజెక్టు డిజైన్‌లను అనుభం ఉన్న కన్సల్టెంట్ల ద్వారా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్రాజెక్టులపై ప్రముఖ కన్సల్టెంట్లు రూపొందించిన ప్రాజెక్టుల పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లను మంత్రి పరిశీలించారు. కాగా, ప్రముఖ సంస్థలతో చర్చించి దర్గం చెరువుతోపాటు కాళేశ్వరం, మిడ్‌మనేరు, కొండపోచమ్మ, సోమశిలలో కొత్తగా చేపట్టనున్న టూరిజం ప్రాజెక్టుల ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి చర్చిచారు.

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశవిదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించగలిగితే తెలంగాణ పేరు ప్రతిష్టలు విశ్వవ్యాప్తంగా కావడమే కాకుండా పర్యాటకుల ద్వారా రాష్ట్రానికి భారీ ఆదాయం సమకూరుతుంది. తెలంగాణ ఏర్పడి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక్క భాగ్యనగరంలోనే కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మోనోరైల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయగలిగితే అదొక గొప్ప పర్యాటక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Next Story