ప్రభుత్వాధికారిని చెప్పుతో కొట్టిన బీజేపీ నాయకురాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2020 6:17 AM GMT
ప్రభుత్వాధికారిని చెప్పుతో కొట్టిన బీజేపీ నాయకురాలు

హరియాణా బీజేపీ నాయకురాలు, టిక్ టాక్ స్టార్ సొనాలీ ఫొగాట్ మరో వివాదంలో చిక్కుకుంది. ఓ ప్రభుత్వాధికారిని ఆమె చెప్పుతో కొట్టారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సొనాలీ ఫొగాట్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

అసలేం జరిగిందంటే.. ఆమె కొందరు రైతుల జాబితా తీసుకుని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ అధికారి వద్దకు వెళ్లారు. కాగా.. సదరు అధికారి ఆమెను దూషించారు. దీంతో.. ఆమె ఆయనను చెప్పుతో కొట్టారు. సదరు అధికారి క్షమించమని వేడుకున్నాడు. మీరు తీసుకువచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే అధికారం తనకు లేదన్నాడు. ఇదంతా పక్కనున్న వారు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. ఆ తర్వాత ఆమె పోలీసులను పిలిపించారు. అయితే, సదరు అధికారి వేడుకోవడంతో ఆయనపై ఫిర్యాదు చేయలేదు. కాగా.. ఈ ఘటన నేపథ్యంలో ఆమెపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఆయన డిమాండ్ చేశారు.

Next Story
Share it