సోష‌ల్‌మీడియా కాల‌క్షేపానికే కాదు.. మ‌నిషి ప్రాణాల‌ను కూడా నిల‌బెట్ట‌వ‌చ్చు అని నిరూపించింది. ఓ యువ‌తి త‌న త‌ల్లి ప‌డుతున్న బాధ‌ల‌ను టిక్‌టాక్ వీడియో తీసి పోస్టు చేసింది. ఈ వీడియోను చూసిన సీఎం వెంట‌నే స్పందించాడు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నిరోదించ‌డానికి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించింన సంగ‌తి తెలిసిందే. క‌ర్ణాట‌క రాష్ట్రం బెళ‌గావి జిల్లాలోని రాయ‌దుర్గ తాలూకాలోని న‌ర‌సాపుర గ్రామానికి చెందిన శేఖ‌వ్వ అనే మ‌హిళ రెండు కిడ్నీలు దెబ్బ‌తిన్నాయి. భ‌ర్త ఓ కిడ్నీ దానం చేయ‌డంతో జన‌వ‌రిలో ఆప‌రేష‌న్ చేశారు. ప్ర‌స్తుతం ఆమె ఇంట్లోనే మందులు వాడుతూ విశ్రాంతి తీసుకొంటోంది.

కాగా.. లాక్‌డౌన్ కార‌ణంగా ఆమె బ‌య‌టికి వెళ్లి మందులు తెచ్చుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఇలా 20 రోజులు గ‌డిచిపోయాయి. రోజు రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఏమీ చేయాలో ఆ కుటుంబ స‌భ్యుల‌కు పాలుపోలేదు. ఆమె కూతురు ప‌విత్ర.. త‌న త‌ల్లి ప‌డుతున్న బాధ‌ల‌ను వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. దీంతో సీఎం య‌డియూర‌ప్ప స్పందించారు. ఆయ‌న సూచ‌న‌ల మేర‌కు జిల్లా అధికారులు శేఖ‌వ్వ ఇంటికి వెళ్లి నెల‌రోజుల‌కు స‌రిప‌డా మందుల‌ను ఆమెకు అందించారు. ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే త‌మ‌కు చెప్పాల‌ని సూచించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.