ఇన్‌స్టాలో టిక్‌టాక్ ఫీచ‌ర్స్‌.. ఇక పండ‌గే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 July 2020 8:30 PM IST
ఇన్‌స్టాలో టిక్‌టాక్ ఫీచ‌ర్స్‌.. ఇక పండ‌గే..

భారత్-చైనా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత్‌లో మ‌నుగ‌డ‌లో ఉన్న‌ చైనా యాప్ లను కేంద్రం బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో టిక్‌టాక్‌తో సహా దేశంలో 59 యాప్‌ల‌ను ప్రభుత్వం నిషేదించింది. అయితే.. టిక్‌టాక్‌కు భార‌త్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా కొన్ని యాప్‌లు టిక్‌టాక్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇక‌ ఇప్పటికే యూ ట్యూబ్ టిక్‌టాక్ త‌ర‌హాలోనే 15 సెకన్ల వీడియోను తీసే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావటనికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ బాట‌లోనే ఇన్‌స్టాగ్రాం సైతం టిక్ టాక్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టిందట.

ఇన్‌స్టా ఇదివ‌ర‌కే.. రీల్స్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దానిపై ఫ్రాన్స్, జర్మనీలో ప్రయోగాలు చేసింది. అది కూడా టిక్‌టాక్ యాప్‌ను మాదిరి ఫీచర్స్ కలిగి ఉందంట‌. ఈ నేఫ‌థ్యంలోనే ఇప్పుడు దానిని భారత్‌లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఇన్‌స్టా ప్రయత్నాలు ముమ్మ‌రం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Next Story