బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా దేశంలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు సహ పలు రాష్ట్రాల్లో గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. వేర్వేరు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా పిడుగులు పడి నవ వరుడు సహా ఐదుగురు మరణించారు.

తమిళనాడులో ఆదివారం ఏకధాటిక సుమారు ఆరు గంటల పాటు వర్షం కురిసింది. ఇక కాంచీపురంలో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన నవ వరుడు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. అటు తిరువళ్లూరు జిల్లా నేమలూరులో రైతు చంద్రన్‌, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు నదిలో చేపలు పడుతున్న ఆనందన్‌, పొలానికి వెళ్తున్న విద్యార్థిని మహాలక్ష్మీలు పిడుగు పాటుకు మృతి చెందారు. అలాగే నమక్కల్‌ జిల్లా పరమత్తివేలూరులో మరో వ్యక్తిపై కొబ్బరి చెట్టు విరిగిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇక ఏపీలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. తూర్పు గోదావరి జిల్లాలో మూడేళ్ల చిన్నారి పిడుగు పడి మృతి చెందింది. ఇక ఏపీలో వచ్చే 48 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.