పుట్టిన రోజు విషాదం.. తుపాకీతో కాల్చుకుని మూడేళ్ల బాలుడు మృతి
By సుభాష్ Published on 27 Oct 2020 12:02 PM GMTఅమెరికాలో విషాదం చోటు చేసుకుంది. హూస్టన్ నగరానికి దగ్గరలో మూడేళ్ల బాలుడు తన పుట్టిన రోజున తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోని హూస్టన్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోని పోర్టర్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టెక్సాస్ నగరానికి చెందిన మూడేళ్ల బాలుడి పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. అందరు పిల్లలు ఆడుకుంటుండగా, పెద్ద శబ్దం వినిపించింది. శబ్దం విన్న తల్లిదండ్రులు పిల్లలు పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా, బాలుడి ఛాతిలో నుంచి బుల్లెట్ దూసుకుపోయి రక్తపు మడుగులో బాడి ఉన్నాడు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, పుట్టిన రోజు వేడుక పురస్కరించుకుని ఇంటికి వచ్చిన బంధువుల జేబులో నుంచి పడిపోయిన పిస్టల్‌ను బాలుడు తీసుకుని కాల్చుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అమెరికాలో ఇలా పిస్టళ్లతో కాల్చుకోవడం వల్ల 97 మంది పిల్లలు మరణించారని గ్రూప్ ఎవ్రీటౌన్ ఫర్ గన్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఇలాంటి తుపాలకు సంస్కృతి వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో మూడో వంతు మందికి తుపాకులున్నట్లు సమాచారం. అందులో అత్యధికంగా తుపాకులున్న రాష్ట్రాల్లోనూ టెక్సాస్ నగరం ఒకటి.