టీవీ నటిపై ప్రేమోన్మాది హత్యాయత్నం..!

By సుభాష్  Published on  27 Oct 2020 10:46 AM GMT
టీవీ నటిపై ప్రేమోన్మాది హత్యాయత్నం..!

దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా ముంబైలో టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై హత్యాయత్నం జరిగింది. మాల్వీ మిత్రుడే ఆమెపై కత్తితో దాడి చేయగా, ఆమె చేతులకు, పొత్తి కడుపులో గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు పాల్పడింది యోగేష్‌ కుమార్‌ మహీపాల్‌ సింగ్‌గా గుర్తించారు. ఏడాది నుంచి తమ ఇద్దరికీ పరిచయం ఉందని, తాము ఫ్రెండ్స్‌గానే ఉంటూ వస్తున్నామని మాల్వీ పోలీసుల ముందు తెలిపింది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని యోగేష్‌ కొంత కాలంగా ఒత్తిడి తీసుకురావడంతో తాను తిరస్కరించానని, దీంతో కోపంతో ఆయన నాపై దాడికి పాల్పడ్డాడని తెలిపింది. మాల్వీ నిన్న రాత్రి ముంబైలోని వెర్పోవా ప్రాంతంలో ఆమెను యోగేష్‌ అడ్డగించి పెళ్లి ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో పొడిచి పారిపోయాడని తెలుస్తోంది. పరారీలో ఉన్న యోగేష్‌ను త్వరలో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మాల్వీ ఫిర్యాదు మేరకు అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే యోగేష్‌ మాల్వీకి ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయం అయినట్లు పోలీసులు తెలిపారు. యోగేష్‌ తనకు తాను నిర్మాత అని చెప్పుకుని మాల్వీని పరిచయం చేసుకున్నాడు. ఇది వరకు ఒకసారి మాత్రమే ఆమె యోగేష్‌ను కలిసినట్లు తమ దర్యాప్తులో తెలిందని పోలీసులు వెల్లడించారు. సోమవారం రాత్రి 9 గంటలకు నార్త్‌ ముంబైలోని వెర్పోవా ప్రాంతంలోని ఒక కేఫ్‌ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Next Story
Share it