విషాదం.. చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

By అంజి  Published on  30 Jan 2020 9:51 AM GMT
విషాదం.. చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గొర్రెకుంటలోని గ్రామంలోని కీర్తనగర్‌ జరిగింది. కట్టమల్లన్న చెరువులో విద్యార్థులు ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. మృతులు రతన్‌, ప్రణయ్‌, నిఖిత స్థానికులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను చెరువులోంచి బయటకు తీసిన స్థానికులు.. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. సరదాగా ఆడుకునేందుకు చెరువ వద్దకు వెళ్లిన వీరు అదుపు తప్పి నీటిలో పడినట్లు తెలుస్తోంది.

మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు ఇప్ప ప్రణయ్‌ (9) మూడవ తరగతి, బరిగెల నిఖిత (7) రెండవ తరగతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరంతా క్రిష్టియన్‌ కాలనీకి చెందిన వారిగి స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి విద్యార్థులు చెరువులో పడడానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. చిన్నారుల మృతితో గొర్రెకుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story