విషాదం నింపిన కార్తీక స్నానం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 6:54 AM GMT
విషాదం నింపిన కార్తీక స్నానం..!

సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా వాగులో స్నానానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులను మృత్యువు కబళించింది. ఈ ఘటన కోహెడ మండలం వరికోలు గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున కంటె నిఖిల్‌, కూన ప్రశాంత్‌, పెందోట వరప్రసాద్‌ వాగు స్నానానికి వెళ్లారు. అయితే వాగు లోతు ఎక్కువగా ఉండడంతో వాగులో మునిగిపోయిన విద్యార్థులు బయటకు రాలేకపోయారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగ పూట తమ పిల్లలు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story
Share it