దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం అర్థరాత్రి కిరారి ప్రాంతంలోని ఓ బట్టల గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ఆగ్నికి ఆహుతి అయ్యారు. మరో 10 మందికి తీవ్రగాయాలు కాగా వారిని వైద్యం నిమిత్తం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. పెద్ద మొత్తంలో ప్రాణనష్టంతో పాటు, ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపను చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇటీవల ముంద్క ప్రాంతంలోని ఓ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే సమచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 21 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు డిసెంబర్ నెలలో అనాజ్‌ మండీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది కార్మికులు మృతి చెందారు. అనాజ్‌మండీలో జరిగిన అగ్ని ప్రమాదం ఢిల్లీలో రెండో అతి పెద్ద ప్రమాద ఘటనగా అధికారులు తెలిపారు. సంఘటన స్థలంలో మృతుల కుటుంబీకుల రోదనలతో దద్దరిల్లింది. అగ్నిమాపక సిబ్బంది 50 మందిని సురక్షితంగా కాపాడారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.