ఆ అధికారులు.. మరీ దారి దోపిడీ దొంగల్లా తయారయ్యారు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 12:05 PM GMT
ఆ అధికారులు.. మరీ దారి దోపిడీ దొంగల్లా తయారయ్యారు.!

అమరావతి: ఏసీబీ అధికారులపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఫైర్‌ అయ్యారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కడం దారుణమన్నారు. కొందరు ఏసీబీ అధికారులు దారి దోపిడీ దొంగల్లా తయారయ్యారని సుభాష్‌ చంద్రబోస్‌ మండిపడ్డారు.

ఏసీబీ అధికారులు పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఏసీబీ డీజీతోనూ, హోంమంత్రితోనూ ఈ అంశంపై మాట్లాడనని డిప్యూటీ సీఎం పిల్లి చంద్రబోస్‌ తెలిపారు. తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టి సస్పెండ్‌ చేయాలన్నారు.

లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయిస్తారా? తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. తప్పు చేసిన ఏసీబీ అధికారులు మీదా అలాగే కేసులు పెట్టాలన్నారు. ఏపీపీఎస్పీ నుంచి డైరెక్ట్‌గా రిక్రూట్‌ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖకు చెందిన కొందరు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. విశాఖ రేంజ్‌ స్టాంప్స్‌ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తున్నామన్నారు.

Next Story