క‌ళ్యాణ్ దేవ్ కొత్త సినిమా టైటిల్ ఇదే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 8:17 AM GMT
క‌ళ్యాణ్ దేవ్ కొత్త సినిమా టైటిల్ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ సాధించ‌క‌పోయినా.. న‌టుడుగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. త‌దుప‌రి చిత్రం కోసం చాలా క‌థ‌లు విని ఆఖ‌రికి ఓ విభిన్న‌మైన క‌థ‌కు ఓకే చెప్పారు. ఎలాంటి హడావుడి లేకుండా ఫస్ట్ స్టెప్‌లో పాజిటివ్ టాక్ అందుకున్న కళ్యాణ్ రెండవ అడుగులో మరింత క్రేజ్ తెచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు. క‌ళ్యాణ్ దేవ్ న‌టించ‌నున్న రెండో సినిమా టైటిల్ 'సూపర్ మచ్చి'. దీపావళి సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. వర్షంలో తడుస్తూ చిన్నారులతో సరదాగా కనిపిస్తున్న కళ్యాణ్ సెకండ్ స్టెప్ కూడా సింపుల్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 'సూపర్ మచ్చి' అనే క్యాచీ టైటిల్ మాస్ ఆడియెన్స్‌ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. కొత్త దర్శకుడు పులి వాసు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పలువురు సీనియర్ నటీనటులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియ‌చేయ‌నున్నారు.

Next Story
Share it