తిప్ప‌రా మీసం 'రివ్యూ'..

By Medi Samrat  Published on  8 Nov 2019 10:22 AM GMT
తిప్ప‌రా మీసం రివ్యూ..

విభిన్న క‌థా చిత్రాలు చేస్తూ.. సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ హీరో శ్రీవిష్ణు. కృష్ణా విజయ్ దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా తిప్పరా మీసం. శ్రీ ఓం బ్యానర్, రిజ్వాన్ ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో నిక్కీ తంబోలీ, రోహిణి హీరోయిన్లుగా నటించారు. ఈ రోజు (నవంబర్ 8న) ఈ సినిమా విడుదలైంది. మరి.. తిప్ప‌రా మీసం శ్రీవిష్ణుకు విజ‌యాన్ని అందించిందా...? లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ - మ‌ణిశంక‌ర్ (శ్రీవిష్ణు) ఓ ప‌బ్ లో పని చేసే డీజే. త‌ల్లి (రోహిణి) అంటే మ‌ణిశంక‌ర్ కి కోపం. అందుక‌నే ఇంటికి దూరంగా.. ప‌బ్ లోనే ఉంటుంటాడు. మ‌త్తు ప‌దార్ధాలు, మందుకు బానిసైన మ‌ణిశంక‌ర్ డ‌బ్బు కోసం బెట్టింగ్ లు, ఇల్లీగ‌ల్ గేమ్స్ ఆడుతుంటాడు. డ‌బ్బు కోసం త‌ల్లిని ఇబ్బంది పెడుతుంటాడు. ఇలా.. బాధ్య‌త‌లేని మ‌ణిశంక‌ర్ ఓ అమ్మాయి ప్రేమ‌లో ప‌డ‌తాడు.ఇత‌ని అస‌లు రంగు తెలుసుకుని దూరంగా ఉంటుంది. అయితే... ఊహించ‌ని విధంగా మ‌ణి ఓ హ‌త్య కేసులో జైలుకెళ‌తాడు. అస‌లు హ‌త్య ఎందుకు చేసాడు..? అస‌లు.. నిజంగా అత‌నే హ‌త్య చేసాడా...? వేరే వాళ్లు చేసి ఇత‌న్ని ఇరికించారా..? మేన‌మామ మ‌ణికి ఓ నిజం చెబుతాడు. అది ఏంటి.? చివ‌రికి అత‌నిలో మార్పు వ‌చ్చిందా..? లేదా..? అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

శ్రీవిష్ణు న‌ట‌న‌

సెకండాఫ్

కెమెరా వ‌ర్క్

మైన‌స్ పాయింట్స్

ప‌స్టాఫ్

క‌థ‌,క‌థ‌నం

కామెడీ లేక‌పోవ‌డం

విశ్లేష‌ణ - శ్రీవిష్ణు గ‌త చిత్రాల‌తో పోలిస్తే.. క్యారెక్ట‌ర్ ప‌రంగా డిఫ‌రెంట్ గా అనిపించినా క‌థ‌లో కొత్త‌ద‌నం ఏమీలేదు. గుబురు గెడ్డంతో ర‌ఫ్ లుక్ లో త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసాడు. డ్ర‌గ్స్ కి బానిస అవ్వ‌డం... ఇంటికి దూరంగా ఉండ‌డం.. త‌ల్లి అంటే కోపం చూపించ‌డం.. ఈ త‌ర‌హా క‌థ‌లు గ‌తంలో చాలా వ‌చ్చాయి. అందుచేత కొత్త‌గా ఏమీ లేదు అనిపించ‌డంతో పాటు.. క‌థ ఎంత‌కు ముందుకు వెళ్ల‌క‌పోవ‌డంతో సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుడికి అస‌లు ఏంటి ఈ క‌థ‌..? అనిపిస్తుంటుంది.

అయితే.. ఈ సినిమా ప్ల‌స్ పాయింట్స్ అంటే శ్రీవిష్ణు న‌ట‌న‌, సిద్ కెమెరా వ‌ర్క్ అని చెప్ప‌చ్చు. సెకండాఫ్‌లో శ్రీ విష్ణు, నిక్కీ తంబోలి పై చిత్రీక‌రించిన‌ లవ్ సీన్సు ఏమాత్రం ఆక‌ట్టుకునేలా లేవు. త‌ల్లి.. కొడుకు బాగుండాల‌ని ఏం చేస్తున్నా..? ఎందుకు అర్ధం చేసుకోవ‌డం లేదు..? అనేది ఆడియ‌న్ కి అర్ధం కాదు. అయితే...పోలీస్ స్టేష‌న్ లో మేన‌మామ బెన‌ర్జి ఓ నిజం చెబుతాడు. అది విన్న త‌ర్వాత మ‌ణిలో మార్పు వ‌స్తుంది.

ఇదేదో ముందే చెబితే బాగుండేది క‌దా... అనిపిస్తుంది. రోహిణి, బెన‌ర్జి పాత్ర‌ల‌కు తగ్గ‌ట్టుగా న‌టించారు. ఫ‌స్టాఫ్ చూసిన త‌ర్వాత చాలా స్లోగా ఉంది అనిపించినా... సెకండాఫ్ కి వ‌చ్చేస‌రికి ఇంట్ర‌స్టింగ్ ట్విస్ట్ ల‌తో ఆస‌క్తిగా ఉంది అని ఫీలింగ్ క‌లుగుతుంది. క్లైమాక్స్ లో ఎమోష‌న‌ల్ సీన్స్ లో శ్రీవిష్ణు అద్భుతంగా న‌టించాడు. ద‌ర్శ‌కుడు కృష్ణ విజ‌య్ క‌థ‌లో కొత్త‌ద‌నం చూపించ‌లేదు. టోట‌ల్ గా ఒక్క మాట‌లో చెప్పాలంటే... తిప్ప‌రా మీసం.. అంత సీన్ లేదు..!

రేటింగ్ - 2.5/5

Next Story