షాపుల పని అయింది.. ఇక బార్‌ల వంతు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 6:22 PM IST
షాపుల పని అయింది.. ఇక బార్‌ల వంతు..!

అమరావతి: మద్యం నియంత్రణపై వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏపీలో బార్ల సంఖ్య కుదింపుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. క్యాంప్‌ కార్యాలయంలో మద్యం నియంత్రణపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. జనవరి 1 నుంచి బార్ల కుదింపు ప్రక్రియ అమల్లోకి రానుంది. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే బార్లను నడపాలన్నారు. బార్‌ల కుదింపుపై విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

Next Story