బిగ్గరగా మాట్లాడటం ద్వారానూ వైరస్‌ వేగంగా వ్యాప్తి..!

By Newsmeter.Network  Published on  15 May 2020 9:44 AM IST
బిగ్గరగా మాట్లాడటం ద్వారానూ వైరస్‌ వేగంగా వ్యాప్తి..!

కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తి వేగంగా విస్తరిస్తుండటంతో పాజిటివ్‌ కేసులు సంఖ్య అధికమవుతుంది. ఇప్పటికే మృతుల సంఖ్య 3లక్షలు దాటింది. ఈ వైరస్‌ను కట్టడిచేసేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. వైరస్‌ను అంతమొందించేందుకు మందును కనిపెట్టేందుకు అన్ని దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రోజురోజుకు ఈ వైరస్‌ వ్యాప్తిపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని ది నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డయాబెటి స్‌ అండ్‌ డైజిస్టివ్‌ అండ్‌ కిడ్నీ డిసీజ్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పలు విధాలుగా పరిశోధనలు చేసిన వీరు.. మాట్లాడే సమయంలో నోటినుండి వచ్చే తుంపర్లు ద్వారా గాల్లోకి కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉంటుందని, కనీసం 10 నిమిషాల కంటే ఎక్కువగానే ఈ వైరస్‌ గాలిలో ఉంటుందని వెల్లడించారు.

Also Read :కోవిద్-19 కేసుల విషయంలో ప్రభుత్వం దగ్గర ఉంది సరైన డేటాయేనా..?

పరిశోధనలు చేసిన తీరును వారు వివరించారు. మూసివేసిన బాక్సులో ఒక వ్యక్తిని ఉంచి 25సెకన్ల పాటు స్టే హెల్తీ అనే పదాన్ని గట్టిగా పదేపదే చెప్పించారు. అదే పెట్టెలో ఒక లేజర్‌ కూడా ఉంచారు. ఆ సమయంలో అతడి నోటి నుండి విడుదలైన తుంపర్లను లేజర్‌ ద్వారా గుర్తించారు. ఎంత పరిమాణంలో తుంపర్లు బయటకు వచ్చాయో లెక్కించారు. తుంపర్లు సగటున 10 నిమిషాల పాటు గాలిలో ఉండిపోయినట్లు తెలిపారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తి బిగ్గరగా మాట్లాడటం ద్వారా దగ్గరగా ఉన్న ప్రదేశంలో ఎనిమి నుంచి పది నిమిషాల పాటు గాలిలో కరోనా వైరస్‌ బతికే ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకా వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయని, మాట్లాడటం ద్వారా అంటు వ్యాధిలా కరోనా వైరస్‌ వస్తుందని పూర్తిస్థాయిలో శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తే.. అన్ని దేశాలు మాస్క్‌ తప్పనిసరి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారత్‌లోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో మాస్క్‌ తప్పనిసరి అని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. మాస్క్‌ లేకుండా బయటకు వస్తే రూ. వెయ్యి జరిమానాలుసైతం విధిస్తున్నాయి. తాజాగా వెలువడుతున్న పరిశోధనలు మరోసారి మాస్క్‌ తప్పనిసరి అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Also Read :ఫాం‌ హౌస్‌లో పేడ ఎత్తిన ఉపాసన.. ఆసక్తికర ట్వీట్‌..!

Next Story