భారతదేశం మరో ప్రయోగంలో విజయం సాధించింది. భూతలం మీద నుంచి భూతలం లోనే ఉన్న లక్ష్యాలను ఛేదించే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-2 కు మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. ఒడిస్సా తీరంలోనే అబ్దుల్ కలామ్ ద్వీపం లో భారత వ్యూహాత్మక సైనిక బలగాల కమాండ్ ఈ పరీక్ష నిర్వహించింది. ఈ క్షిపణికి రెండు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్ధ్యం ఉంది. 20 మీటర్ల పొడవున్న రెండు దశల బాలిస్టిక్ క్షిపణి ఇది.17 టన్నుల లాంచ్ వెయిట్ సామర్థ్యంతో వెయ్యి కిలోల పేలోడ్ బరువును ఇది మోసుకెళ్ళగలదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అగ్ని-2 క్షిపణిని మొదటిసారిగా 1999 ఏప్రిల్ 11న పరీక్షించారు. భూమిపై ఉన్న 2వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని -2 క్షిపణి 2018లో భారత సైన్యంలో చేరింది. గతంలో అగ్ని క్షిపణులను పగటి సమయంలోనే ప్రయోగించేవే శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ ప్రయోగం సక్సస్ అవ్వటం తో ఇక నుంచి రాత్రి వేళల్లో కూడా లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణిని భారత శాస్త్రవేత్తలు తయారు చేసినట్టే.

Ejgxsqiwwaegdpd 450x300

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.