ఢిల్లీ: బంగారం ధర రోజు రోజుకు ఎలా పెరుగుతోందో, బంగారం మీద మోజు కూడా అంతే ఎక్కువగా పెరుగుతోంది. మనదేశంలో బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడం బయట దేశాల్లో తక్కువ ధరకే లభిస్తుండటంతో బంగారాన్ని దక్కించుకోవడం కోసం వింత వింత పోకడలు పోతున్నారు. గురువారం రాత్రి మస్కట్‌ నుంచి ఓమన్‌ ఎయిర్‌వేస్‌ విమానం చెన్నై ఎయిర్పోర్ట్ కి చేరుకుంది. అర్ధరాత్రి ఆ విమానం మళ్లీ మస్కట్‌కి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో విమానం శుభ్రం చేస్తున్న సిబ్బందికి ఓ సీటు కింద సంచి కనిపించడంతో పరిశీలించి చూసేసరికి అందులో 3.3 కిలోల బరువున్న బంగారు కడ్డీలు కనిపించాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Chennai 8ml9qyn

అటు హాంగ్ కాంగ్ నుంచి అక్రమంగా ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకువచ్చిన డ్రోన్లు, మొబైల్ ఫోన్లను, మెమొరీ కార్డులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి హాంగ్ కాంగ్ నుంచి రూ.26 లక్షల రూపాయల విలువచేసే ఆరు మొబైల్ ఫోన్లు, కెమెరాలతో కూడిన నాలుగు డీజీఐ డ్రోన్లు, పదివేల మెమొరీ కార్డులు, నాలుగు ఎం డ్రోన్లు, ఆరు యాపిల్ ఫోన్లను ఢిల్లీకి స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపి పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Img 20191116 091211

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.