మాకు కాల్పుల శబ్దం వినిపించింది.. పోలీసులు అక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్పారు

By సుభాష్  Published on  10 July 2020 4:48 AM GMT
మాకు కాల్పుల శబ్దం వినిపించింది.. పోలీసులు అక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్పారు

ఉత్తరప్రదేశ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేను శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే హతమైనట్లు యూపీ పోలీసులు అధికారికంగా వెల్లడించారు. గురువారం ఉజ్జయిని మహాంకాళి దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లగా, పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో వికాస్‌ దూబేను కాన్పూర్‌కు వాహనంలో తరలిస్తుండగా, వారి వాహనం బోల్తాపింది. అదే అదనుగా భావించిన గ్యాంగ్‌స్టర్‌ దూబే పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోని పారిపోతూ కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు దూబేను ఎన్‌ కౌంటర్‌ చేశామని పోలీసులు తెలిపారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాన్పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తాము కాల్పుల శబ్దం విన్నామని స్థానికులు తెలిపారు. స్థానికుడు అశ్విన్ పాశ్వాన్ మాట్లాడుతూ తమకు గన్ షాట్స్ వినిపించాయని, పోలీసులు తమను అక్కడ ఉండకండి అంటూ చెప్పారని అతడు మీడియాకు వెల్లడించాడు. ఒక గంటలో కాన్పూర్ కు వెళ్లబోయే సమయంలో వికాస్ దూబే ప్రయాణిస్తున్న పోలీసు వాహనం బోల్తా కొట్టడం.. పోలీసుల దగ్గర నుండి తుపాకీని తీసుకుని వెళ్లబోయే సమయంలో అతడిని లోంగిపోమని పోలీసులు అడిగారని.. అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో పోలీసులు అతన్ని హతమార్చారు.

వికాస్ దూబే గ్యాంగ్ పోలీసుల హతమార్చిన తర్వాత అతడి అనుచరులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం మొదలుపెట్టారు. వికాస్ దూబే కూడా తనను చంపేస్తారని ముందే భావించినట్లు తెలుస్తోంది. అందుకే అరెస్ట్ సమయంలో 'నేను వికాస్ దూబే.. కాన్పూర్ వాసిని' అని గట్టిగా అరిచాడు. అక్కడే ఉన్న పోలీసు అతడు అలా అరవడంతో గట్టిగా కొట్టాడు కూడానూ..! ఇక ఈ ఘటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సమయంలోనే శుక్రవారం ఉదయం వికాస్ దూబేను చంపేసినట్లు పోలీసులు కన్ఫర్మ్ చేశారు.

దూబేను గురువారం అరెస్ట్‌ చేసిన తర్వాత పోలీసులు అతన్ని విచారించారు. పోలీసుల విచారణలో దూబే పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. 8 మంది పోలీసులను హతమార్చిన రోజు .. పోలీసులు వస్తారనే సమాచారం ముందుగానే అందినట్లు తెలిపాడు. పోలీసులను చంపిన తర్వాత మృతదేహాలను తగలబెట్టాలని భావించానని, మృతదేహాలను దహనం చేయడానికి ఒకే చోట సేకరించి చమురు కూడా ఏర్పాటు చేశానని విచారణలో తెలిపినట్లు తెలుస్తోంది.

Next Story