కన్న కొడుకే కాలయముడు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Oct 2019 11:51 AM ISTపశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులకే కాల యముడిగా మారాడు ఓ కన్న కొడుకు. అల్లారు ముద్దుగా పెంచినందుకు తల్లిదండ్రులను అత్యంగా దారుణంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున తల్లిదండ్రులు మార్తమ్మ, నాగేశ్వరరావును ఇనుపరాడ్‌తో కొడుకు కొట్టి చంపాడు. స్థానికులు నిందితుడు రమేష్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. కొంత కాలం క్రితం నిందితుడు రమేష్ (30)ను భార్య వదిలేసి వెళ్లిపోయింది. నిందితుడు రమేష్‌కు మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story