సూర్యాపేట  జిల్లా ఇమాంపేట లో జరిగిన సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. విషయంలోకి వెళితే ఇమాంపేటలో శివసత్తువుగా ఉంటున్న యువకుడు, సూర్యాపేటలో ఉంటున్న మరొక యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయంగా వీరు ఇద్దరు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శివసత్తువగా ఉన్న యువకుడు ఈ క్రమంలో బొంబాయి వెళ్ళి లింగ మార్పడి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే సూర్యాపేట యువకుడు ఇమాంపేట శివసత్తువతో పెళ్ళికి నిరాకరించాడు. సూర్యాపేటకు చెందిన యువకుడు వేరొక అమ్మాయిని వివాహం చేసుకొంటున్నాడని తెలిసి.. ఇమాంపేట యువకుడు అతని బంధువులు పెళ్ళి జరుగుతున్న చోటుకి వెళ్ళి వివాహాన్ని నిలిపివేశారు.

ఈ విషయం తెలిసిన సూర్యపేటకు చెందిన శివసత్తుల సంఘం లింగ మార్పిడి చేయించుకున్న యువకుడిని ఇమాంపేట గ్రామ పంచాయితీకి పిలిపించి శివాసత్తువల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. శివసత్తువులా ఉన్న నువ్వు లింగ మార్పిడి చేయించుకొని పూజలు నిర్వహించడం అనేది శివసత్తువలకు కలంకం అని. అదేవిధంగా శివసత్తువలా.. ఉన్న తరువాత మరొక యువకుడితో ప్రేమాయణం నడపడం అసలు సరి అయినా పద్దతి కాదని మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పంచాయితీ జరుగుతున్న స్థలానికి వెళ్ళిఅందరిని వెళ్లగొట్టారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.