వజ్రాలు కొనాలనుకుంటే ఇది తెలుసుకోవాల్సిందే....!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2019 8:09 AM GMT
వజ్రాలు కొనాలనుకుంటే ఇది తెలుసుకోవాల్సిందే....!

సహజ వజ్రాలకు ఎందుకంత డిమాండ్...?

ప్రకృతి వారసత్వంగా అందించిన సహజ నవరత్నాలలో అద్బుతమైంది వజ్రం. మూడు బిలియన్ ఏళ్ల ప్రాచీన కాలం నుండి ప్ర‌కృతి మనకు వ‌స్రాల‌ను వారసత్వంగా అందిస్తోంది. విలువైన వజ్ర సంపద భవిష్యత్తు తరాలకు బహుమతిగా అందించడంలో పొందే అనుభూతి ఎంత గొప్పదో.. తెలియాలంటే మన పూర్వీకుల గత చరిత్రను తెరచి చూడాల్సిందే. చారిత్రక ప్రసిద్థి గాంచిన వజ్రాలన్నీ భారతదేశానికి చెందినవే. అందుకు కోహినూరు వజ్రం ఓ మంచి ఉదాహరణగా నిలుస్తోంది.

ఒక పురాణ గాథ ...

అమూల్యమైన నవరత్నాలు అసలు ఎలా తయారయ్యాయో ఒక పురాణ గాథ ఉంది. ఒకనాడు బాల అనే రాక్షస‌ సంహారం జరిగింది. ఆ సంహారం దేవతా ప్రీతి కోసం చేశారు. బాలను సంహరిచగానే అతని శరీర భాగాలు ముక్కలై వేర్వేరు రంగుల్లో మెరుస్తూ వెళ్ళీ అక్కడి దేవతా మూర్తులమీద పడ్డాయి. ఫలితంగా ఆ రాయి రంగు ఆ దేవతలకు వచ్చిందని పురాణ గాథ చెబుతుంది. మన వాళ్ళ దృష్టిలో ఆ రంగు పొందిన దేవతలే నవగ్రహాలు. రంగు రాయితో బంధం ఏర్పడింది. ఆ విలువైన రాళ్లనే నవరత్నాలు అంటారు.

దృఢమైన వజ్రం ప్రకృతికే సొంతం...

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనే నానుడి బహుశా దాని కఠినత్వంతోనే వచ్చిందేమో....? ప్రపంచంలో ప్రకృతి సృష్టించిన అత్యంత దృఢమైన వస్తువు ఉందంటే అది ఒక్క వజ్రమే. వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి...? వజ్రాలు ఎలా ఏర్పడతాయి? అనే సందేహాలు ప్రతి ఒక్కరి మదిలో మెదిలే సందేహాలు. కొన్ని బిలియన్ సంవత్స‌రాల‌ క్రితం భూమి పొరలలో చోటుచేసుకున్న విపరీతమైన ఒత్తిడికి లోనయ్యింది. ఆ సమయంలో నేల మాళిగలో అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ఘనీభవించిన కార్బన్ అణువుల నుంచి వజ్రాలు ఏర్పడుతాయి. సృష్టిలో లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో ఒకటి వజ్రం.

ఖచ్చితంగా చెప్పాలంటే భూమి యొక్క ఉపరితలం క్రింద 100 మైళ్ళ లోతులో అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా వజ్రాలు ఉపరితలంపైకి నెట్టబడతాయి. సహజంగా వజ్రం ఏర్పడిన‌ ఈ ప్రయాణం.. వాస్తవానికి 3 బిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. ఇది వజ్రాలను డైనోసార్ల కంటే 50 రెట్లు పాతదిగా, ప్లానెట్ ఎర్త్ కంటే పురాతనమైనవిగా గుర్తించారు.

డైమండ్ బేరింగ్ కింబర్‌లైట్స్ నుండే వజ్రాలను చాలా అరుదుగా కనుగొనడం జరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుత కాలంలో లభిస్తున్న ప్రకృతి సిద్ధ వజ్రాలు చాలావరకు దశాబ్దాల క్రితం కనుగొనబడిన కింబర్లైట్ల నుండి ఏర్పడినవే. అందువల్ల సహజ వజ్రాలు కనుగొనడం చాలా అరుదు. అవి ఎంతో అమూల్యమైనవి, అద్భుతమైనవి.

వజ్రాలు, గ్రీకు పదం ‘అడమాస్’ నుండి అవిర్భవించింది. వజ్రాల స్పతిక విలక్షణ నిర్మాణ ప్రక్రియ కారణంగా, భూమి నుండి వెలువడే ప్రతి సహజ వజ్రం ఒకదానికొకటి సారూప్యత ఉండదు. అచ్చం రెండు వేలిముద్రలు ఒకేలా ఉండవు. అలానే సహజ వజ్రాలు కూడా అంతే. మార్కెట్లో లభ్యమయ్యే మానవ నిర్మిత ప్రతిరూపాల నుండి వాటిని వేరు చేస్తుంది. మీరు వజ్రాన్ని కొనుగోలు చేసినప్పుడు మీరు భూమి చరిత్రలో కొంత భాగాన్ని కొనుగోలు చేస్తున్నారు అనే భావించాలి. మోయిసానైట్, ల్యాబ్ సృష్టించిన వజ్రాలు లేదా క్యూబిక్ జిర్కోనియా రాళ్ళ వంటి భారీగా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులు సహజ వజ్రాలతో సరితూగవు.

సాధారణంగా పసుపు, గోధుమ లేదా బూడిద నుండి రంగులేనిది. తక్కువ తరుచుగా నీలం, ఆకుపచ్చ, నలుపు, అపారదర్శక తెలుపు, గులాబీ, వైలెట్, నారింజ, ఎరుపు రంగుల్లో వజ్రాలు లభిస్తాయి.

Next Story