పోలవరం ప్రాజెక్ట్ చరిత్రలో నవశకం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Nov 2019 8:42 AM GMT
అమరావతి: పోలవరం ప్రాజెక్టు చరిత్రలో నవశకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో ఉత్సాహంగా పనులు ప్రారంభమయ్యాయి. రేయింబవళ్లు పనులు చేయడానికి మేఘా సంస్థ సిద్ధమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి మేఘా సంస్థ కంకనబద్ధమైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రివర్స్ టెండరింగ్‌లో మేఘా సంస్థ దక్కించుకుంది. ప్రాజెక్టు వద్ద గురువారం నాడు మేఘా సంస్థ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు. పోలవరం పనులను జలవనరుల శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముందుగా స్పిల్ వే నిర్మాణ పనులను మేఘా సంస్థ చేపట్టింది. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ మేఘా సంస్థను ఆదేశించిన విషయం తెలిసిందే. గోదావరి నదిలో వరద ప్రవాహం తగ్గడంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పునఃప్రారంమయ్యాయి.