అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ స్టేను నిరాకరించింది. 60 శాతం రిజర్వేషన్‌లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కూడా ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. కాగా తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఎన్నికల ఏర్పాట్లకు మాత్రం హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే పదవీకాలం పూర్తైన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలను ఏపీ సర్కార్‌ త్వరలోనే నిర్వహించనుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.