కమిటీ వేస్తాం.. ప్రభుత్వం తమ అభిప్రాయం చెప్పాలి: హైకోర్టు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 11:05 AM GMT
కమిటీ వేస్తాం.. ప్రభుత్వం తమ అభిప్రాయం చెప్పాలి: హైకోర్టు

ముఖ్యాంశాలు

  • సమస్యల పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలతో కమిటీ
  • ప్రభుత్వ అభిప్రాయాన్ని అడిగి చెప్పాలని ఏజీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. రూట్ల ప్రైవేటీకరణపై వాదనలు కొనసాగాయి. ఆర్టీసీ సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని న్యాయవాది విద్యాసాగర్‌ హైకోర్టుకు తెలిపారు. గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడు వర్తిస్తాయా అని హైకోర్టు ప్రశ్నించింది. ఎస్మా కింద సమ్మె చట్టవిరుద్ధంగా ప్రకటించవచ్చని న్యాయవాది విద్యాసాగర్‌ కోర్టుకు తెలిపారు. 1998, 2015లో ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తెస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందిన విద్యాసాగర్‌కు కోర్టుకు తెలిపారు. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్‌ఆర్టీసీకి వరిస్తాయన్న హైకోర్టు.. 2015లో ఇచ్చిన ఉత్తర్వులు ఆరు నెలలకే పరిమితమని వ్యాఖ్యనించింది. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలతో కమిటీ వేస్తామని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ అభిప్రాయాన్ని అడిగి చెప్పాలని అడ్వకేట్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటి రోజుకు వాయిదా వేసింది.

Next Story