ఆ ఐదు ఎకరాల ఆఫర్ బెగ్గింగ్ కాదు: అసదుద్దీన్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 4:21 PM IST
ఆ ఐదు ఎకరాల ఆఫర్ బెగ్గింగ్ కాదు: అసదుద్దీన్‌

ఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు తీవ్ర నిరాశపర్చిందన్నారు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ. రాజ్యంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. లీగల్‌ హక్కుల కోసం పోరాడుతామని అసదుద్దీన్‌ తెలిపారు. సుప్రీంకోర్టు సుప్రీమేనని.. అమోఘం కాదన్నారు. మసీదు నిర్మాణం కోసం ఐదెకరాలా ఆఫర్‌ను తిరస్కరించాలన్నారు. ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వానదలతో ఏకీభవిస్తున్నామని తెలిపారు. న్యాయం కోసం మేము సుప్రీంకోర్టులో పోరాడామన్నారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశించామని పేర్కొన్నారు. ముస్లింల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని అసదుద్దీన్‌ వ్యాఖ్యనించారు. తీర్పును సవాల్‌ చేసే విషయంపై ముస్లిం లా బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Next Story