ఓ కారు వంతెనపై వెళుతూ ఆటోను తప్పించబోయి నదిలో పడిపోయింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు నీటిలో మునిగారు. వీరిలో ఓ చిన్న బాబు కూడా ఉన్నాడు. అయితే నీరు ఎంతో లోతు లేకపోవడంతో కారు పూర్తిగా మునగలేదు. దీంతో అందులో ఉన్నవారంతా కారుపైకి వచ్చి కూర్చున్నారు. మనుషుల బరువుకు కారు మునిగిపోతుందనేమో అని ఒకరు ఆ బిడ్డను వంతెనపై సహాయం చేయడం కోసం నిలుచున్న వ్యక్తులకు విసిరారు. అయితే, వారు ఆ బిడ్డను పట్టుకోలేకపోవటంతో మళ్ళీ నీళ్లలో పడిపోయాడు.. వంతెన మీద ఉన్న ఓ వ్యక్తి వెంటనే నీటిలోకి దూకి చిన్నారిని రక్షించాడు. ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలోని ఓర్చా పట్టణంలో జరిగిన ఈ ఘటన వంతెన వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.