హైదరాబాద్‌: నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. నాచారం విఎస్‌టీ కాలనీలో ఓ ఇంటి బయట చిన్నారి అడుకుంటున్నాడు. ఈ క్రమంలో బయట దొరికిన బాటిల్‌ను చిన్నారి ఇంట్లోకి తీసుకొని వెళ్తుండగా అది ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో చిన్నారి, చిన్నారి తండ్రికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడి పరిసరాలను పోలీసులు, క్లూస్ టీం పరిశీలించారు. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని పరిశీలన నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.