చరిత్రలోనే విషాద ఘటన..గర్ల్ ఫ్రెండ్ పై కోపంతో యువకుడు..
By రాణి Published on 24 April 2020 7:23 PM ISTగర్ల్ ఫ్రెండ్ తో గొడవ పడిన యువకుడు కోపంతో రగిలిపోయి ఏకంగా 22 మందిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన కెనడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కెనడాలోని హాలిఫాక్స్ లో గాబ్రియేల్ వర్ట్ మన్ అనే వ్యక్తి కృత్రిమ దంతాలను అమర్చే వృత్తి చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఏమైందో ఏమోగాని ఓ రోజు తన గాళ్ ఫ్రెండ్ తో తీవ్రమైన గొడవ జరిగింది. ఆ కోపంతో గాబ్రియేల్ గత ఆదివారం పోలీసు యూనిఫాం ధరించి పెట్రోలింగ్ వాహనంలో నోవాస్కోటియా ప్రావిన్స్ పొర్టాపిక్ నగరానికి వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న గన్ తో ఓ ఇంటిలోని వారందరినీ కాల్చి చంపేశాడు.
Also Read : కరోనా పేషెంట్ ఉన్న అంబులెన్స్ లోకి యువకులు
ఆ తర్వాత అక్కడు నుంచి 50 కిలో మీటర్ల దూరరంలో ఉన్న మరో ఊర్లో కూడా కాల్పులు జరిపి కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈలోగా సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని అతడిపై కాల్పులు జరిపారు. గాబ్రియేల్ - పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు మహిళ మరణించింది కానీ అతడికి మాత్రం ఏమీ కాలేదు. కేవలం గాళ్ ఫ్రెండ్ తో గొడవ కారణంగా తమకు సంబంధం లేని 22 మందిని గాబ్రియేల్ చంపడం..కెనడా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటన అని పోలీసులు చెప్తున్నారు.
Also Read : పోలీసుల సడన్ సర్‌ప్రైజ్.. అవాక్కయిన ఇంటివారు