ఆ విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించేందుకు సిద్ధమైన నాసా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Nov 2019 3:38 PM IST
ఆ విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించేందుకు సిద్ధమైన నాసా..!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఈ సారీ మాత్రం రాకెట్‌లు లాంచింగ్‌లు కాకుండా కొత్త తరహా ఆవిష్కరణకు తెరలేపింది.

ఎలక్రికల్‌ విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించేందుకు నాసా సన్నహాలు చేస్తోంది. 2015 నుంచి కరెంట్‌ విమానాలపై నాసా ప్రయోగాలు చేస్తోంది. తాజాగా కాలిఫోర్నియా ఎడారిలో ఉన్న నాసా ఏరోనాటిక్స్‌ బేస్‌లో 'ఎక్స్‌-57 మాక్స్‌వెల్‌' ఎలక్ట్రిక్‌ విమానానికి సంబంధించిన చిత్రాన్ని విడుదల చేసింది.

Nasa1

వచ్చే సంవత్సరం నాటికి ఈ విమానాన్ని ఆకాశంలోకి తీసుకెళ్లేందుకు నాసా ప్లాన్‌ చేస్తోంది. గత 20 సంవత్సరాల్లో నాసా తయారు చేసిన విమనాల్లో మాక్స్‌వెల్‌ మొదటిది కావడం విశేషం. ఈ మేరకు నాసా సంస్థ ఈ విషయాలను వెల్లడించింది.

ఇప్పటికే పలు ప్రైవేట్‌ కంపెనీలు విద్యుత్‌ విమానాల్ని తయారు చేయడం ప్రారంభించాయని ప్రాజెక్ట్‌ మేనేజర్‌ బ్రెంట్‌ కోబ్‌లీ చెప్పారు. అయితే ఈ విమానం ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నా.. పైలట్లు అనుభూతి పొందేలా పూర్తి నమూనాను డిజైన్‌ చేసి నాసా రిలీజ్‌ చేసింది.

Nasa2

మాముల విమానాలతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ విమానాల బరువు తక్కువగా ఉంటుందని, శబ్దం కూడా తక్కువ వస్తుందని బ్రెంట్‌ కోబ్‌లీ తెలిపారు. 'ఎక్స్‌-57 మాక్స్‌వెల్‌' 14 మోటర్లతో నడిస్తుందని, బరువు తక్కువగా ఉండి సులువుగా పైకి ఎగురుతుందన్నారు.

Next Story