తమన్‌కి సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన తేజు.. ఇంతకీ ఏంటా గిఫ్ట్..?
By Newsmeter.Network Published on 26 Nov 2019 6:19 AM GMTసుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ప్రతి రోజు పండగే'. యువ దర్శకుడు మారుతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశాడు. సాయి తేజ్, తమన్ ఫ్రెండ్ షిప్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే... ఎంతో ఇష్టమైన తన ఫ్రెండ్ తమన్‌కు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ తో నిజంగానే సర్ ప్రైజ్ చేశాడు సాయి తేజ్.
ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే...
తమన్ మ్యూజిక్ టేస్ట్ కి తగ్గట్టుగా పెర్ల్ మాలెట్‌స్టేషన్ అనే మ్యూజిక్ ఇన్స్ర్టూమెంట్ గిఫ్ట్ గా అందించాడు సాయిధరమ్ తేజ్. వీరిద్దరి కాంబినేషన్లో పలు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. తనకు సాయి ఇచ్చిన గిఫ్ట్ గురించి తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ‘‘నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ ఈ లవ్లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్'' ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద సర్ప్రైజ్. ప్రతి రోజూ పండగే అన్న మాటను ఈయన నిజం చేశారన్నారు. సాయి చాలా మంచి వ్యక్తి ఆయన సక్సెస్ కోసం ప్రార్ధిస్తున్నానంటూ ట్విట్టర్ లో ఫొటోతో సహా పోస్ట్ చేశాడు.