సమంత.. ఓ కుక్కపిల్ల కథ..!

By అంజి  Published on  25 Nov 2019 6:58 AM GMT
సమంత.. ఓ కుక్కపిల్ల కథ..!

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంతకు కుక్కలంటే ఎంతో ఇష్టం. సమంత భర్త నాగ చైతన్యకు కూడా కుక్కలంటే ఎంతో ప్రాణం. అందుకే రెండు కుక్క పిల్లలను ఈ టాలీవుడ్‌ దంపతులు పెంచుకుంటున్నారు. సమంత, నాగచైతన్య ఎంతో ఇష్టంగా కుక్కలను పెంచుకుంటున్నారు. అయితే తాను ప్రాణంగా పెంచుకున్న కుక్కపిల్ల చనిపోయినప్పుడు తాను ఎంత బాధపడ్డానో.. అని తెలియజేస్తూ సమంత ఎమోషనల్‌ పోస్టు చేశారు.

పైగా ఈ మధ్య తన కుక్క ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తుంది సమంత. ఇప్పుడు ఈమె అప్పాయింట్‌మెంట్‌ చేసిన స్పెషల్ టీంలో కూడా ఆ కుక్క ఫోటోలను తీయడానికి తీసుకుందేమో అనే ప్రచారం ఆ మధ్యలో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. అక్కినేని నాగచైతన్య, సమంత రెండు అమెరికన్ పిట్ బుల్స్‌ను పెంచుకుంటున్నారు. వాటి పేర్లు హష్‌ అక్కినేని, డ్రోగో అక్కినేని అన్న విషయం తెలిసంది. అయితే ఇటీవలే సమంత, నాగ చైతన్య హష్‌ తొలి పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. హష్‌ బర్త్‌డే పార్టీకి స్నేహితులను పిలిపించి గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. హష్‌, డ్రోగో కంటే ముందు తాను బూగబూ అనే కుక్క పిల్లను పెంచుకున్నానని, దానికి ఓ వింతైన వైరస్‌ సోకడంతో నెలల వయసులోనే చనిపోయిందని సమంత ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

Samantha

వీడియోలో మీరు చూస్తున్న కుక్కపిల్ల హష్‌కాదు.. దాని పేరు బుగాబూ. తాను కుక్కను ఎలా పెంచుకోవాలో 30 రోజుల కోర్సు చేశానని, పూర్తిగా సిద్ధంగా ఉన్న తర్వాతే బుగాబూ ఇంటికి తెచ్చుకున్నాని సమంత తెలిపింది. నా జీవితంపై పూర్తి నియంత్రణ ఉందనుకున్న కాబట్టి కుక్కు విషయంలోనూ అలాగే ఉండాలని అనుకున్నాను. బుగాబును ఇంటికి తీసుకువచ్చినప్పుడు దానికి పార్వో వైరస్‌ ఉందని తెలిసిందని సమంత పోస్టులో పేర్కొంది. బుగాబూ ఇంటికి వచ్చిన నాలుగు రోజుల్లోనే మరణించింది. అప్పుడు తాను గట్టిగా ఏడ్చానని గుర్తు చేసింది. తన చావుకు నేనే కారణమనుకున్నాను. మరో కుక్కను పెంచుకోవద్దనకున్నానని సమంత చెప్పింది.

అప్పుడే హష్‌ ఇంటికి వచ్చింది..

ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత చైతన్య మరో కుక్కను తెచ్చుకుందామన్నాడు. చైతన్యకి నాకంటే అన్నీ బాగా తెలసు కాబట్టి ఓకే అన్నాను. అప్పుడే హష్‌ ఇంటికి వచ్చిందని సమంత గుర్తు చేసుకుంది. బుగాబూకి సోకిన పార్వో వైరస్‌ గురించి రీసెర్చ్‌ చేశానని సమంత తెలిపింది. అది ఒక్కసారి ఇంట్లోకి వస్తే నాలుగు నెలల పాటు ఉంటుందని తెలుసుకున్న సామ్‌.. హష్‌కు కూడా ఆ వైరస్‌ అంటుకుంటుందేమోనని భయపడ్డానని తెలిపింది. ఆ వైరస్‌ పోవడానికి వెటర్నరీ డాక్టర్‌, డాగ్‌ ట్రైనర్‌ని, ఫ్రెండ్స్‌ను టార్చర్‌ పెట్టానని.. హష్‌ ఇంటికి వచ్చిన కొన్ని వారాల పాటు నరకం అనుభవించానని సమంత పేర్కొంది. పీడ కలలు వచ్చేవని, హష్‌కు ఏమైనా అవుతుందేమోనని రాత్రిళ్లు ఏడ్చే దానిని సమంత తన ఇన్‌స్టా పోస్టులో తెలిపింది. మొత్తానికైతే హష్‌కు ఏడాది నిండింది. ఈ సందర్భంగా హష్‌కు సమంత పుట్టిన రోజు వేడుకలు జరిపారు. మన జీవితం మన కంట్రోల్‌లో ఉండదు.. కాబట్టి దాని గురించి ఆలోచించకండి అంటూ సమంత పేర్కొన్నారు. ఈ పోస్టుపై బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ హార్ట్‌ సింబల్‌తో రియాక్ట్‌ అయ్యారు.

Next Story