కరాచీ స్టాక్ మార్కెట్‌పై ఉగ్ర దాడి
By సుభాష్ Published on 29 Jun 2020 12:10 PM ISTపాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సోమవారం కరాచీలోని స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దాడికి పాల్పడిన అనంతరం ఉగ్రవాదులు స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలోనే నక్కి ఉన్నారు. దీంతో భద్రతా బలగాలు భవంలో ఉన్నవారిని ఖాళీ చేయించి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురి ఉగ్రవాదులను కాల్చిచంపినట్లు సమాచారం.
కాగా, ఉగ్రవాదులు స్టాక్ ఎక్ఛేంజ్‌లోకి చొరబడిన ముష్కరులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల ఏరివేతకు ప్రయత్నిస్తున్నారు.
ఇక స్టాక్ ఎక్ఛేంజ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడటంతో భద్రతా బలగాలు భారీగా మొహరించాయి. ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్న పాక్ బలగాలు ఉగ్రవాదులను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో రాకపోకలు నిషేధించారు.