విద్యార్ధి సంఘాల కొట్లాట..ఓయూ రణరంగం..!!

హైదరాబాద్: ప్రజలను, ఆర్టీసీ కార్మికులను రెచ్చగొడుతున్న ఐకాస విద్యార్థి విభాగం ఖబర్దార్ అంటూ టీఆర్‌ఎస్వీ విద్యార్ధులు నినాదాలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లో జరుగుతున్న ఐక్య విద్యార్థి సంఘాల మహా సభను అడ్డుకోవాడానికి వచ్చిన TRSV విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్ టి సి సమ్మెకు మద్దతుగా విద్యార్థి సంఘాలు చేస్తున్న సభ గందరగోళంలో పడింది. సభ లోకి టి ఆర్ ఎస్ విద్యార్థి విభాగం నాయకులు దూసుకొచ్చారు. సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేదిలేదంటూ టీఆర్‌ఎస్వీ విద్యార్దులు నినాదాలు చేశారు. ఆందోళన చేసిన విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.