తమిళనాడు: మళ్లీ లాక్‌డౌన్‌.. మద్యం కోసం పరుగులు పెడుతున్న మందుబాబులు

By సుభాష్  Published on  17 Jun 2020 10:17 AM GMT
తమిళనాడు: మళ్లీ లాక్‌డౌన్‌.. మద్యం కోసం పరుగులు పెడుతున్న మందుబాబులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత రెండు నెలలుగా ఉన్న లాక్‌డౌన్‌ సమయంలో మద్యం షాపులు పూర్తిగా మూత పడటంతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మద్యం లేక పచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ నిద్రలేని రాత్రులు గడిపారు. అయితే దేశంలో లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా తిరిగి మద్యం షాపులు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. షాపులు తెరవగానే మద్యం షాపుల ముందు క్యూలు కట్టారు. ఇక తమిళనాడులో అయితే కొన్ని కిలోమీటర్ల మేర మద్యం ప్రియులు బారులు తీరారు. మండుటెండల్లో సైతం మద్యం కోసం పడిగాపులు కాచి మద్యం కొనుగోలు చేశారు. ఇది చదవండి: భారత్‌ – చైనా‌ ఉద్రిక్తతలు: 19న అఖిలపక్ష సమావేశానికి మోదీ పిలుపు

ఇక దేశంలో కరోనా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకూ సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని చెన్నైతోపాటు చంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో 11 రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది.

దీంతో మద్య ప్రియులు ముందు జాగ్రత్తగా ఆ నాలుగు జిల్లాల్లో లీటర్ల కొద్ది మద్యం కొనుగోలు చేసేందుకు పరుగులు పెడుతున్నారు. మద్యం షాపుల వద్ద క్యూలు కడుతున్నారు. ముందస్తుగా మద్యం బాటిళ్లను కొనుగోళ్లు చేసేందుకు ఉదయం నుంచే వైన్స్‌ షాపుల వద్ద క్యూలు కడుతున్నారు.

ఇది చదవండి: కరోనాతో ముఖ్యమంత్రి పీఏ మృతి

Next Story