మొబైల్ షాప్‌లో అగ్నిప్రమాదం.. రూ.4 లక్షలు విలువైన వస్తువులు దగ్ధం

By అంజి  Published on  28 Nov 2019 3:35 AM GMT
మొబైల్ షాప్‌లో అగ్నిప్రమాదం.. రూ.4 లక్షలు విలువైన వస్తువులు దగ్ధం

జోగులాంబ గద్వాల్‌ జిల్లా కేంద్రంలో అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. రమేష్‌ మొబైల్ షాప్‌లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. షాపుల్‌ ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యార. మంటల్లో దాదాపు రూ.4లక్షల విలువైన మొబైల్స్‌తో పాటు పలు వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫైర్‌ ఎస్పీ ఉపేందర్‌గౌడ్‌ షార్ట్‌ సర్క్యూటే ప్రధాన కారణమని తెలిపారు.

Next Story
Share it