3 గవర్నమెంట్ జాబులు సాధించిన జొమాటో డెలివరీ బాయ్
హైదరాబాద్‌లో జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.
By అంజి Published on 2 March 2024 8:15 AM GMT3 గవర్నమెంట్ జాబులు సాధించిన జొమాటో డెలివరీ బాయ్
హైదరాబాద్‌లో జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. తాడ్వాయి మండలంలోని సంగోజివాడి గ్రామానికి చెందిన బల్వంత్‌రావు తెలంగాణలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులకు ఎంపికయ్యారు. జొమాటోకు డెలివరీ బాయ్‌గా పని చేస్తూనే, అతను ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యాడు. అనుకున్నది సాధించాడు. బల్వంత్‌రావు ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతూ ఉన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్‌సీ)లో వాచ్‌మెన్‌గా పనిచేసిన మంచిర్యాల జిల్లా పొన్కల్ గ్రామానికి చెందిన జి ప్రవీణ్ కుమార్ మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ గురుకుల విద్యాలయాల ఫలితాల్లో అతను మూడు ప్రభుత్వ ఉద్యోగాలు-TGT, PGT, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను సొంతం చేసుకున్నాడు. ప్రవీణ్ ప్రాథమిక విద్య పూర్తి చేసి జన్నారంలో డిగ్రీ చదివాడు. తండ్రి తాపీ మేస్త్రీగా, తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలిగా ఉన్నారు. ప్రవీణ్ ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో M.Com, B.Ed., M.Ed చదివాడు. పోటీ పరీక్షల కోసం పట్టుదలతో సన్నద్ధమవుతున్న సమయంలో ఎమ్మార్సీలో ఐదేళ్లపాటు వాచ్‌మెన్‌గా పనిచేశాడు.