అవి మనుషులు మాట్లాడే మాటలేనా.? : వైఎస్ షర్మిల

YSRTP Cheif Sharmila Fire On BRS. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

By Medi Samrat  Published on  19 Feb 2023 12:15 PM GMT
అవి మనుషులు మాట్లాడే మాటలేనా.? : వైఎస్ షర్మిల

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహిళలను గౌరవించే పార్టీ బీఆర్ఎస్ కాదని.. తన పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు మైల్ స్టోన్ దాటినప్పటి నుంచి అడుగడుగునా బీఆర్ఎస్ గుండాలు ఆడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. నర్సంపేటలో ఇప్పటికే ఇబ్బందులు పెట్టగా, తాజాగా మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి చర్యలకు దిగుతున్నారని షర్మిల తెలిపారు. ప్రభుత్వ అవినీతిపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని ప్రశ్నించారు. తమ పార్టీకి ఆదరణ వస్తుందనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులు తమ పాదయాత్రను అడ్డుకుంటున్నారని షర్మిల విమర్శించారు. ఓ మహిళను పట్టుకుని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇష్టానుసారంగా మాట్లాడటం సరైనదేనా అని ప్రశ్నించారు. ఒక మహిళ నిలబడి అవినీతి గురించి నిలదిస్తే ఇలా తనపై ఇలా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. అవి మనుషులు మాట్లాడే మాటలేనా? అని ప్రశ్నించారు. శంకర్ నాయక్ భార్య గిరిజనుల భూకబ్జాలు విషయంలో A1 ముద్దాయిగా ఉందని షర్మిల ఆరోపించారు.

మహబూబాబాద్‭లో షర్మిల పాద్రయాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేయడంతో ఆమె తిరిగి హైదరాబాద్‭కు చేరుకున్నారు. వైఎస్సార్టీపీ ఆఫీస్ అయిన లోటస్ పాండ్ వద్దకు పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యకర్తల్ని వైఎస్సార్టీపీ ఆఫీసు వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాలు చేసినా.. పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చినా అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


Next Story